కరోనా బారినపడి, చికిత్స కరవై మృతిచెందిన వారి కుటుంబ సభ్యులందరికీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం సంతాపం తెలిపారు.
"చికిత్స అందకపోవడం వల్ల చనిపోయిన కొవిడ్ రోగుల కుటుంబ సభ్యులకు, వారి సన్నిహితులకు నా సంతాపం. ఈ విషాదంలో మీరు ఒంటరిగా లేరు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు చేసే ప్రార్థనలు, వారు చూపించే సానుభూతులు మీతో ఉన్నాయి. మనమంతా కలిసి ఉంటామనే నమ్మకం ఉంది."