కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు మానవ వనరుల లభ్యతను పెంచే మార్గాల అన్వేషణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నత సమీక్షా సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా.. మానవ వనరుల పెంపుతో పాటు కొవిడ్ విధుల్లో చేరే ఎంబీబీఎస్, నర్సింగ్ పాస్ఔట్ విద్యార్థులకు ప్రోత్సాహాలు ఇవ్వటంపై చర్చించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ భేటీలోని తుది నిర్ణయాలను సోమవారం ప్రకటించనున్నట్లు పేర్కొన్నాయి.
" భేటీ నిర్ణయాల్లో నీట్ పరీక్ష వాయిదా, ఎంబీబీఎస్ పాస్ఔట్ విద్యార్థులు కొవిడ్ విధుల్లో చేరేందుకు ప్రోత్సహించటం వంటివి ఉండవచ్చు. వాటితో పాటు ఎంబీబీఎస్, నర్సింగ్ తుది సంవత్సరం చదువుతున్న విద్యార్థుల సేవలనూ వినియోగించుకోవటమూ ఉండొచ్చు. కొవిడ్ విధులు నిర్వర్తిస్తున్న వైద్య సిబ్బందికి ప్రభుత్వ నియామకాల్లో ప్రాధాన్యతతో పాటు ఆర్థిక ప్రోత్సాహాలు ఇవ్వొచ్చు. "