భారత్లో జాతీయ విద్యా విధానం-2020(ఎన్ఈపీ) అమలుపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఛైర్మన్ ప్రొ. ధీరేంద్రపాల్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్-19 మహమ్మారి కారణంగా.. ఎన్ఈపీ అమలుపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. అయితే ఎన్ఈపీని సరైన సమయంలోనే తీసుకొచ్చారని తెలిపారు.
"జాతీయ విద్యా విధానం-2020(ఎన్ఈపీ)ను భారత్లో సరైన సమయంలోనే తీసుకొచ్చారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఎన్ఈపీ అమలుపై తీవ్ర ప్రభావం పడింది. కొవిడ్ సమస్య లేకపోతే క్షేత్ర స్థాయిలో ఎన్ఈపీ అమల్లోకి వచ్చేది."
-- ప్రొ. ధీరేంద్రపాల్ సింగ్, యూజీసీ ఛైర్మన్
జాతీయ విద్యా విధానాన్ని సమర్థవంతంగా తీసుకెళ్లేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సెలర్లతో కేంద్రం చర్చలు జరుపుతోందని ధీరేంద్రసింగ్ తెలిపారు. ఎన్ఈపీలోని కొన్ని కార్యకలాపాలు ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభమయ్యాయన్నారు. 2022 జులై నుంచి దేశవ్యాప్తంగా ఈ పాలనీని అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం సమాయత్తమవుతోందన్నారు.
విద్యార్థులకు దేశ సంస్కృతి, సంప్రదాయాలను నేర్పించటమే కాక.. ప్రపంచంలోనే ఉత్తమ పౌరులుగా విద్యార్థులను జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) తీర్చిదిద్దుతుందన్నారు.
ఇదీ చూడండి:'భారత కొవిడ్ టీకా సర్టిఫికేట్కు 96 దేశాల ఆమోదం'