మహారాష్ట్ర ముంబయిలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించనివారికి విధించిన జరిమానాల ద్వారా ఏడాది కాలంలో రూ.54 కోట్లకు పైగా రాబట్టినట్లు అధికారులు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. గతేడాది ఏప్రిల్‌లో మాస్క్‌ను తప్పనిసరి చేసింది బృహన్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ). ఈ నిబంధనను ఉల్లంఘించినవారికి రూ.200 జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మాస్క్ ఉల్లం'ఘనుల' నుంచి రూ. 54 కోట్ల వసూలు - మహారాష్ట్రలో మాస్క్ ఫైన్
కరోనా ఆంక్షల వేళ మాస్క్ ధరించని వారి నుంచి జరిమానాల ద్వారా రూ.54 కోట్లకుపైగా వసూలు చేసినట్లు ముంబయి స్థానిక పాలనా యంత్రాంగం తెలిపింది. ఏడాది కాలంలోనే ఈ మొత్తం సేకరించినట్లు వెల్లడించింది.
మాస్క్ జరిమానా
అప్పటినుంచి 26,87,339 మంది మాస్క్ నిబంధనను ఉల్లంఘించగా.. వారి నుంచి రూ.54 కోట్లకుపైగా వసూలు చేశామని అధికారులు తెలిపారు. బీఎంసీ అధికారులు (రూ.47,36,62,800), పోలీసులు (రూ.62,65,7,800), రైల్వే అధికారులు (రూ.50,39,200) జరిమానాల ద్వారా రాబట్టినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:కరోనా కట్టడికి రాష్ట్రాల ఆంక్షల వ్యూహం