తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా 6.31 లక్షల మందికి కరోనా టీకా - covid vaccination in india

దేశంలో ఇప్పటివరకు కరోనా టీకా పొందిన వారి సంఖ్య 6,31,417కు చేరింది. మంగళవారం సాయంత్రం నాటికి 1,77,368 మంది వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ అందించినట్లు కేంద్రం తెలిపింది.

covid-19-over-6-dot-31-lakh-healthcare-workers-vaccinated-across-country
కరోనాపై రణం- 6.31 లక్షల మందికి టీకా

By

Published : Jan 19, 2021, 10:49 PM IST

దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ కార్యక్రమం వేగంగా సాగుతోంది. నాలుగో రోజూ టీకాల సరఫరా ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా కొనసాగింది. మంగళవారం సాయంత్రం 6 గంటల నాటికి 1,77,368 మందికి టీకా అందించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు టీకా స్వీకరించిన వారి సంఖ్య 6,31,417కు చేరిందని తెలిపింది.

ఏ రాష్ట్రంలో ఎంత మందికి..?

టీకా అందించిన తర్వాత ప్రతికూల ప్రభావాలు తలెత్తిన కేసులు అతి స్వల్పంగా నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. మొత్తం తొమ్మిది మందిలో దుష్ప్రభావాలు కనిపించాయని తెలిపింది. వీరికి ఆస్పత్రిలో చికిత్స అందించినట్లు పేర్కొంది. ఇద్దరు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నారని, మిగిలినవారు డిశ్ఛార్జి అయ్యారని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:'యాక్టివ్ కేసులకన్నా టీకా తీసుకున్నవారే అధికం'

ABOUT THE AUTHOR

...view details