భారత్లో కొవిడ్-19 టీకా పంపిణీ 14 రోజు విజయవంతంగా సాగింది. దేశవ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం రాత్రి 7 గంటల సమయానికి 4,40,681 మందికి వ్యాక్సిన్ అందించినట్టు తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ. టీకా తీసుకున్న వారి సంఖ్య 33లక్షలు దాటినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో 33 లక్షలు దాటిన టీకా లబ్ధిదారులు
దేశంలో కరోనా టీకా పొందిన వారి సంఖ్య 33లక్షలు దాటింది. ఒక్కరోజులోనే సుమారు 4లక్షల 40వేల మందికిపైగా వ్యాక్సిన్ అందించినట్టు పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ.
దేశంలో 33 లక్షలు దాటిన టీకా లబ్ధిదారులు
ఈ నెల 16న వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి 62,939 ద్వారా మొత్తం 33,68,734 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:వచ్చేనెల తొలివారం నుంచి కరోనా యోధులకు టీకా