దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 5.20 శాతంగా ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 21.15 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ఆదివారం 6,20,216 మందికి పరీక్షలు నిర్వహించామంది.
కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం...
- దేశంలో మొత్తం టెస్టింగ్ ల్యాబ్లు-2,393
- ప్రైవేట్ ల్యాబ్లు -1,173
- ప్రభుత్వానికి చెందినవని- 1,220
దేశంలో రోజూ ప్రతి 10లక్షల మందిలో 1,53,298కి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- దేశవ్యాప్తంగా టీకాలు అందినవారు- 1,11,16,854
- వ్యాక్సిన్ మొదటి డోసు అందినవారు- 63,97,849
- రెండో డోసు అందినవారు- 9,67,852
ఇప్పటివరకు 37, 51,153 మంది ఫ్రంట్ లైన్ సిబ్బందికి టీకా మొదటి డోసు ఇచ్చామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 60.17 శాతం వ్యాక్సిన్ డోసులు 7 రాష్ట్రాల్లో అందించామని వివరించింది. కర్ణాటకలో అత్యధికంగా 11.8 శాతం టీకా డోసులు వేశామని తెలిపింది.