తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా'లో రికార్డు స్థాయిలో కరోనా విజృంభణ - ఇండియాలో కరోనా వ్యాప్తి

దేశంలో కరోనా అంతకంతకూ విస్తరిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్​ పాజిటివిటీ రేటు అధికంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొవిడ్​ సంక్రమణ రేటు ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించింది.

Maharashtra records highest positivity rate
'మహా'లో అత్యధిక స్థాయిలో పాజిటివిటీ రేటు

By

Published : Mar 28, 2021, 3:16 PM IST

Updated : Mar 28, 2021, 4:47 PM IST

దేశంలో కరోనా పాజిటివ్‌ రేటు క్రమంగా పెరుగుతోందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా వైరస్ సంక్రమణ రేటు.. జాతీయ సగటు 5.04 శాతం కంటే ఎక్కువగా ఉందని వెల్లడించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 22.78 శాతం పాజిటివిటీ రేటు ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో చంఢీగడ్‌-11.85 శాతం, పంజాబ్‌-8.45, గోవా-7.03, పుదుచ్చేరి-6.85, ఛత్తీస్‌గఢ్‌-6.79, మధ్యప్రదేశ్-6.65, హరియాణా-5.41 శాతం చొప్పున నమోదైంది.

15 రాష్ట్రాలు, ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల్లో.. జాతీయ సగటు కంటే తక్కువ వైరస్‌ పరీక్షలు జరుగుతున్నాయని కేంద్రం తెలిపింది.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య 24 కోట్లు దాటిందని వివరించింది ఆరోగ్య శాఖ. ఇప్పటివరకూ 6కోట్ల మందికిపైగా కరోనా వ్యాక్సిన్​ తీసుకున్నట్టు వివరించింది. రోజువారీగా కేసుల్లో.. మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌, కర్ణాటక, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోనే 81.46 శాతం మంది కరోనా బారినపడుతున్నారని ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇదీ చదవండి:దేశంలో మరో 62,714 కరోనా కేసులు

Last Updated : Mar 28, 2021, 4:47 PM IST

ABOUT THE AUTHOR

...view details