తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Corona Cases: కేరళలో మరో 7వేల మందికి కరోనా

కేరళలో కొత్తగా 7,167 మందికి కరోనా(Kerala Corona Cases) సోకినట్లు తేలింది. వైరస్ కారణంగా మరో 167 మంది మరణించారు. మరోవైపు.. తమిళనాడులో కొత్తగా 1,009 కేసులు వెలుగు చూశాయి.

Kerala Corona Cases
కేరళ కరోనా కేసులు

By

Published : Oct 31, 2021, 8:27 PM IST

కేరళలో కరోనా(Kerala Corona Cases) వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా 7,167 మందికి వైరస్(Kerala Covid Cases Today) నిర్ధరణ అయింది. మరోవైపు.. కొవిడ్​ మరణాల సంఖ్యను ఆ రాష్ట్రం మళ్లీ సవరించింది. దాంతో ఆ రాష్ట్రంలో కొత్తగా 167 మంది కరోనాతో(Kerala Corona Cases) మరణించినట్లు తేలింది. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 49,68,657కు చేరగా.. మొత్తం మరణాల సంఖ్య 31,681కి పెరిగింది.

కేరళలో మరో 6,439 మంది వైరస్​ను(Kerala Corona Cases) జయించారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 48,57,181కి చేరుకుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 79,185 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. కొత్తగా 65,158 నమూనాలను పరీక్షించగా.. ఎర్నాకులం జిల్లాలో అత్యధికంగా 1,046 మందికి వైరస్​ సోకినట్లు తేలింది. తిరువనంతపురంలో 878, త్రిస్సూర్​లో 862 మందికి వైరస్ నిర్ధరణ అయింది.

మరోవైపు.. దేశ రాజధాని దిల్లీలో 45 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ కారణంగా... ఎవరూ చనిపోలేదు.

వివిధ రాష్ట్రాల్లో కొత్త కేసులు ఇలా...

  • తమిళనాడులో 1,009 మంది మహమ్మారి బారినపడ్డారు. 1,183 మంది వైరస్ నుంచి కోలుకోగా.. మరో 19 మంది మరణించారు.
  • కర్ణాటకలో 292 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. మరో 11 మంది మృతి చెందారు.
  • ఒడిశాలో కొత్తగా 488 మందికి కరోనా సోకగా.. మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details