కేరళలో కరోనా(Kerala Corona Cases) వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 6,444 మందికి వైరస్(Kerala Covid Cases Today) నిర్ధరణ అయ్యింది. మరోవైపు 187 మంది కరోనాతో(Kerala Corona Cases) మరణించినట్లు తేలింది. మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 49,80,398కు చేరగా.. మరణాల సంఖ్య 32,236కి పెరిగింది.
కేరళలో మరో 8,424 మంది వైరస్ను(Kerala Corona Cases) జయించారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 48,72,930కి చేరుకుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 74,618 యాక్టివ్ కేసులు ఉన్నాయి.