దేశంలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. కేరళలో రికార్డు స్థాయిలో ఒక్కరోజులోనే అత్యధికంగా 43,529 మందికి వైరస్ నిర్ధరణ అయింది. ఆ రాష్ట్రంలో ఒక్కరోజు కేసుల్లో ఇవే అత్యధికం. కేరళలో మొత్తం కేసుల సంఖ్య 19,80,879కు చేరింది. కొత్తగా వైరస్ ధాటికి మరో 95 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 6,053కు చేరింది. కేరళలో వైరస్ పాజిటివిటీ రేటు 29.75 శాతంగా ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.
మహారాష్ట్రలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 46,781 మందికి వైరస్ సోకింది. మరో 816 మంది ప్రాణాలు కోల్పోయారు.