కరోనా వ్యాప్తి వేగాన్ని సూచించే ఆర్ వ్యాల్యూ (r value Covid India) క్రమంగా తగ్గుతోంది. సెప్టెంబర్ నుంచి ఆర్ వ్యాల్యూ ఒకటి లోపే ఉంటోంది. (Covid 19 india) యాక్టివ్ కేసులు అధికంగా ఉన్న 10 రాష్ట్రాల్లో ఆర్ వ్యాల్యూ (r value Covid) అక్టోబర్ 18 తర్వాత ఒకటి లోపునకు పడిపోయిందని చెన్నైకి చెందిన మేథమెటికల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. అయితే, కొన్ని నగరాల్లో మాత్రం యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉందని పేర్కొంది. కోల్కతాలో ఆర్ వ్యాల్యూ ఒకటి కన్నా అధికంగా ఉందని తెలిపింది. నవరాత్రుల్లో దుర్గా పూజ సందర్భంగా ప్రజలు ఎక్కువగా గుమిగూడటం వల్ల కోల్కతాలో కేసులు (Kolkata Covid cases) పెరిగాయని వివరించింది.
బెంగళూరులోనూ ఆర్ వ్యాల్యూ (Bangalore Covid News) ఒకటి కన్నా అధికంగా ఉంది. మరోవైపు, చెన్నై, పుణె, ముంబయి నగరాల్లో ఆర్ వ్యాల్యూ ఒకటి లోపే ఉంది. మొత్తంగా సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 18 మధ్య దేశంలో ఆర్ వ్యాల్యూ (r value of Covid in India) 0.90గా ఉందని ఇన్స్టిట్యూట్ లెక్కగట్టింది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3 మధ్య దేశంలో ఆర్ వ్యాల్యూ 1.11గా ఉండటం గమనార్హం. అప్పటి నుంచి ఈ వ్యాల్యూ క్రమంగా తగ్గుతూ వచ్చింది. సెప్టెంబర్ 4 నుంచి 7 మధ్య 0.94, 11 నుంచి 15 మధ్య 0.86, 14 నుంచి 19 మధ్య 0.92, 17 నుంచి 21 మధ్య 0.87గా నమోదైంది.
'రెండో డోసు ఇవ్వండి'