గుజరాత్లో కప్పా వేరియంట్ కలకలం రేపింది. రాష్ట్రంలో ఒకేసారి ఐదు కేసులు బయటపడ్డాయి. జామ్నగర్లో 2, పాంచ్మహల్ జిల్లాలోని గోద్రాలో 2, మెహ్సానాలో ఒక కేసు వెలుగుచూసింది. కాగా, పాంచ్మహల్ వాసి మృతిచెందాడు. అతడికి డయాబెటిస్ కూడా ఉందని అధికారులు పేర్కొన్నారు.
కప్పా వేరియంట్ కలకలం- ఆ రాష్ట్రంలో 5 కొత్త కేసులు - gujarat
దేశంలో రెండో దశ కరోనా తగ్గుముఖం పడుతున్న వేళ గుజరాత్లో కప్పా రకం వైరస్ కలకలం సృష్టించింది. రాష్ట్రంలో కొత్తగా 5 కేసులు వెలుగుచూశాయి. ఒకరు మరణించారు.
కప్పా వేరియంట్
గోద్రాలో కప్పా కేసు నమోదైన కారణంగా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు హాజరైన కుటుంబ సభ్యులు సహా 50మంది నుంచి నమూనాలు సేకరించారు. అతడితో సన్నిహితంగా ఉన్న 22 మంది ఆర్టీపీసీఆర్ శాంపిల్స్ తీసుకున్నారు.
ఇదీ చూడండి:Kappa Variant: ఆ రాష్ట్రంలో కప్పా వేరియంట్ కలకలం!