కరోనా అంతానికి భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ టీకాను ఇప్పటి వరకూ రెండు డోసులుగా ఇస్తుండగా.. మూడో డోసుపై క్లీనికల్ ట్రయల్స్‌కు భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతినిచ్చింది. రెండో డోసు ఇచ్చిన ఆరు మాసాల తర్వాత.. 'బూస్టర్ డోస్'గా మూడో డోసు ఇవ్వనున్నారు.
కొవాగ్జిన్ 'మూడో డోసు'కు డీసీజీఐ అనుమతి - కొవాగ్జిన్
కొందరు వలంటీర్లకు కొవాగ్జిన్ టీకా మూడో డోసు ఇచ్చేందుకు భారత్ బయోటెక్‌కు డీసీజీఐ అనుమతినిచ్చింది. రెండో డోసు ఇచ్చిన ఆరు నెలలకు ఈ బూస్టర్ డోసు ఇవ్వాలని స్పష్టం చేసింది.
![కొవాగ్జిన్ 'మూడో డోసు'కు డీసీజీఐ అనుమతి COVID-19: Govt's expert panel allows clinical trials for third dose of Covaxin](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11249248-thumbnail-3x2-covaxin.jpg)
ఇప్పటివరకూ తొలి రెండు దశల్లో క్లీనికల్ ట్రయల్స్ కోసం వచ్చిన వలంటీర్లలో కొందరికి మూడో డోసు ఇచ్చి పరీక్షించేందుకు విషయ నిపుణ కమిటీ పచ్చజెండా ఊపింది. ఈ మూడో డోసుకు సంబంధించి.. రెండో దశ క్లీనికల్ ట్రయల్స్‌కు ఇచ్చిన ప్రొటోకాల్స్‌లో సవరణలు చేస్తూ భారత్ బయోటెక్.. డీజీసీఐకి నివేదిక కూడా ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో అన్ని విషయాలపై కూలంకషంగా చర్చించిన నిపుణుల కమిటీ.. 6ఎమ్సీజీ వరకు మాత్రమే బూస్టర్ డోస్‌గా ఇచ్చి పరిశీలించేందుకు అనుమతించింది. అంతేకాకుండా మూడో డోసు తీసుకున్న వారి ఆరోగ్య పరిస్థితిపై 6 మాసాల పాటు నిఘా ఉంచాలని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:-'ఆందోళన వద్దు.. మన టీకాలు పూర్తి సేఫ్'