దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీలలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్ష 2021 జనవరికి బదులు ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. దేశంలో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆధికారిక నోటిఫికేషన్ త్వరలోనే రానుంది. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
"ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. వచ్చే ఏడాది జనవరిలో జరగాల్సినజేఈఈపరీక్షను ఫిబ్రవరిలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సరైనా బ్రాంచ్ కానీ స్కోర్ చేయలేకపోయిన వారికి ఇదో సదావకాశం."