రావి చెట్టు, ఆక్సిజన్‌ను నిరంతరం అందిస్తుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ప్లక్స వృక్షం శ్వాస కోశ సమస్యలను నివారించే దివ్యౌషధం. పురాతన, బౌద్ధకాలం నుంచి ఈ చెట్టుకు ఆధ్యాత్మికంగా.. వైద్య పరంగా ఎంతో విశిష్టత ఉంది.
ఏడాదికిపైగా ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా మహమ్మారి. శ్వాస వ్యవస్థపై దాడి చేయడం దాని ప్రధాన లక్షణం. కరోనా రెండో వేవ్‌లో ఎక్కువగా ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోవడం వల్ల చాలా మంది చనిపోతున్నారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆగ్రా జిల్లా నౌబరీ గ్రామ వాసులు ఆక్సిజన్ కోసం రావి చెట్టు కిందకు చేరుతున్నారు. తాత్కాలిక నివసాలు ఏర్పరచుకుంటున్నారు. అంతేకాదు దీనికిందే యోగా, వ్యాయామాలు చేస్తున్నారు. అందుకు ఒక యోగా గురువు కూడా ఉన్నారు. ఇక్కడికొచ్చిన వారికి ఉదయం, సాయంత్రం యోగా నేర్పిస్తున్నారు.