తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ జిల్లాల్లో కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించండి!' - భారత కొవిడ్ కేసులు

Covid-19 Containment Measures: దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 10శాతం కంటే ఎక్కువ నమోదైన జిల్లాల్లో క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్.

Covid-19
కొవిడ్ కేసులు

By

Published : Dec 11, 2021, 4:14 PM IST

Covid-19 Containment Measures: దేశంలో కొవిడ్-19, ఒమిక్రాన్ వ్యాప్తి​ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. వైరస్ వ్యాప్తిని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, జిల్లాల వారీగా దృష్టిసారించాలని కేంద్రం ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్..​ రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

మిజోరాం, కేరళ, సిక్కింలోని 8జిల్లాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు 10శాతానికిపైగా ఉందన్నారు. కేరళ, మిజోరాం, అరుణాచల్​ప్రదేశ్​, పుదుచ్చేరి, మణిపుర్​, బంగాల్, నాగాలాండ్​లోని 19 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5-10శాతం ఉన్నట్లు తెలిపారు. దీంతో ఈ 27 జిల్లాల్లో కరోనా వ్యాప్తిని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. అన్నిరాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ నిబంధనలను విధిగా పాటించాలన్నారు.

" దేశంలోని ఏదైనా జిల్లాలో కరోనా పాజిటివిటీ రేటు 10శాతం కంటే ఎక్కువ లేదా 60 శాతం కంటే ఎక్కువ పడకలు నిండిపోవడం జరిగితే.. ఆ జిల్లాలను కంటైన్మెంట్ జోన్​లుగా పరిగిణించాలి. వైరస్ కట్టడి చర్యలను చేపట్టాలి. రాత్రి కర్ఫ్యూలు, జనసమూహాలను తగ్గించడం, రాజకీయ, సామాజిక, వినోద, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిషేధించడం, పెళ్లిళ్లు, అంత్యక్రియల్లో జనసమూహాన్ని తగ్గించడం.. లాంటి చర్యలను చేపట్టాలి."

-- రాజేశ్​ భూషణ్, కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ

కేంద్రం జారీచేసే వైరస్ కట్టడి చర్యలకు ప్రజలు సహకరించాలన్నారు రాజేశ్ భూషణ్. రాష్ట్ర స్థాయిలో కొవిడ్​ నిబంధనలను ఎప్పటికప్పుడు సమీక్షించి మార్గదర్శకాలను జారీ చేయాలని.. ఈ మేరకు అన్ని రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.

Omicron Cases In India: దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ.. ఒమిక్రాన్ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో మొత్తం ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 33కు చేరింది.

ఇదీ చూడండి:దిల్లీలో ఒమిక్రాన్‌ రెండో కేసు.. ముంబయిలో 144 సెక్షన్‌

ABOUT THE AUTHOR

...view details