తెలంగాణ

telangana

దేశీయ విమాన ప్రయాణాలు మరింత ప్రియం

దేశీయ విమాన సేవలు అందించే సంస్థలు ఛార్జీలను 15 శాతం వెసులుబాటు కల్పించుకోవచ్చని పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. జూన్​ 1 నుంచి కొత్త ఛార్జీలు అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది.

By

Published : May 29, 2021, 1:11 PM IST

Published : May 29, 2021, 1:11 PM IST

flight charge hike, airfare increased by 15%
దేశీయ విమానా ప్రయాణాలు మరింత ప్రియం

దేశీయ విమాన ప్రయాణాలు మరింత ప్రియం కానున్నాయి. సంస్థలు ఛార్జీలను 15 శాతం పెంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు పౌరవిమానయానశాఖ ప్రకటన విడుదల చేసింది. జూన్​ 1 నుంచి ఈ ఛార్జీలు అమలోకి వస్తాయని పేర్కొంది. గతేడాది మేలో విడుదల చేసిన ఉత్తర్వులను డీజీసీఏ సవరించింది.

దేశంలోని అన్ని మార్గాలను 7 సెక్టార్లుగా విభజించి ఛార్జీలను డీజీసీఏ ఖరారు చేసింది. కనీస ఛార్జీ రూ.2200-7200 మధ్య ఉండనుంది గత మేలో డీజీసీఏ ఖరారు చేసింది. తాజా ఉత్తర్వుల్లో కనీస ఛార్జీ రూ.2600-రూ.7800గా ఖరారు చేసింది. గరిష్ఠ ఛార్జీ రూ.8700-రూ.24200 సెక్టారుకు అనుగుణంగా కనీస ఛార్జీలు ఉంటాయని ఉత్తర్వులలో పేర్కొంది.

ఇదీ చదవండి :narada case: 'నారదా కేసులో నవ్వుల పాలయ్యాం'

ABOUT THE AUTHOR

...view details