తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్వల్పంగా పెరిగిన కేసులు- కొత్తగా 15వేల మందికి పాజిటివ్​ - కొవిడ్​ కేసులు

Covid cases in india: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. కొత్తగా 15,102 కేసులు నమోదయ్యాయి. 31,377 మంది కోలుకున్నారు. 278 మంది మరణించారు.

Corona cases in India
కరోనా కేసులు

By

Published : Feb 23, 2022, 9:27 AM IST

Updated : Feb 23, 2022, 9:38 AM IST

Covid cases in india: దేశంలో కరోనా కొత్త కేసులు క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు.. 15,102 కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 278 మంది మరణించారు. 31,377 మంది కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 1.28శాతానికి పరిమితమైంది.

  • మొత్తం మరణాలు: 5,12,622
  • యాక్టివ్ కేసులు: 1,64,522
  • మొత్తం కోలుకున్నవారు: 4,21,89,887

Vaccination in India:

దేశంలో వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య 1,76,19,39,020కు చేరింది.

World Covid cases:

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఆందోళకరంగానే ఉంది. 24 గంటల వ్యవధిలో 1,628,408 కేసులు బయటపడ్డాయి. మొత్తం కేసులు 428,280,657, మరణాలు..5,925,477కు చేరుకున్నాయి. 356,111,078 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. రష్యా, జర్మనీ, బ్రెజిల్, దక్షిణ కొరియా దేశాల్లో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.

  • జర్మనీలో 158,507 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 329 మంది కరోనాకు బలయ్యారు.
  • రష్యాలో తాజాగా 135,172 కరోనా కేసులు నమోదయ్యాయి. 796 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రెజిల్​లో రోజువారీ కరోనా మరణాలు సంఖ్య భారీగా ఉంటోంది. 24 గంటల వ్యవధిలో 839 మంది చనిపోయారు. కొత్తగా 101,285 కేసులు వెలుగుచూశాయి.
  • దక్షిణ కొరియాలో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 99,550 మందికి వైరస్​ సోకింది. 58 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఫ్రాన్స్​లో కరోనా మహమ్మారి ధాటికి మరో 285 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 97,382 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

ఇదీ చూడండి:ఎన్నికల ప్రచార ఆంక్షల్లో మరిన్ని సడలింపులు.. వాటికి ఈసీ ఓకే

Last Updated : Feb 23, 2022, 9:38 AM IST

ABOUT THE AUTHOR

...view details