తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళలో భారీగా తగ్గిన కరోనా కేసులు- ఆందోళనకరంగానే మరణాలు!

కేరళలో కరోనా కొత్త కేసులు(kerala cases today)భారీగా తగ్గాయి. తాజాగా 6,664 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. మరోవైపు.. మరణాల సంఖ్య గణనీయంగానే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

COVID-19 in Kerala
కేరళలో భారీగా తగ్గిన కొత్త కేసులు

By

Published : Oct 25, 2021, 6:58 PM IST

కేరళలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఆదివారంతో పోల్చితే కొత్త కేసులు(kerala cases today) భారీగా తగ్గాయి. కొత్తగా 6,664 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. అయితే.. మరణాలు(Covid-19 deaths) మాత్రం ఆందోళనకరంగానే ఉన్నాయి. సోమవారం ఒక్కరోజే 281 మంది వైరస్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 49,12,789, మరణాలు 28,873కు చేరాయి.

సోమవారం మొత్తం 9,010 మంది వైరస్(Corona virus)​ నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య 74,735కు దిగొచ్చింది. సోమవారం మొత్తం 14 జిల్లాల్లో 61,202 మందికి పరీక్షలు నిర్వహించారు.

  • కర్ణాటకలో కొత్తగా 290 పాజిటివ్​ కేసులు రాగా.. 10 మంది మరణించారు.
  • మిజోరాంలో 158 మంది వైరస్​ బారినపడ్డారు. మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
  • దేశవ్యాప్తంగా 1.02 కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇదీ చూడండి:Covid cases in India: దేశంలో మరో 14,306 మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details