కరోనా కేసులు ఉద్ధృతంగా పెరుగుతున్న వేళ.. టీకా తీసుకోవాలని ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేస్తోంది. అయితే వ్యాక్సన్పై నెలకొన్న భయం, ఆందోళనల కారణంగా ముందుకు రావడంలేదు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగులు. టీకా తీసుకోవాలని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఎంప్లాయిస్ యూనియన్(ఏఏఈయూ)కు చెందిన 18 వేల మంది ఉద్యోగులను ఎన్ని సార్లు కోరినా.. వారు అనుమానాలను వీడటం లేదని సంఘం ప్రధాన కార్యదర్శి బాల్రాజ్ సింగ్ తెలిపారు.
"దేశవ్యాప్తంగా ఏఏఈయూలో 18 వేల మంది ఉద్యోగులున్నారు. వారిలో 45 ఏళ్ల పైబడినవారు 12వేల మంది ఉన్నారు. టీకా తీసుకుంటే.. సైడ్ ఎఫెక్ట్స్, మరోసారి వైరస్ బారిన పడతామనే భయం, ఆందోళన వారిలో నెలకొంది. నా భార్యతో కలిసి ఇటీవల వ్యాక్సిన్ వేయించుకున్నా. మేము ఆరోగ్యంగానే ఉన్నాం. అందరూ సత్వరమే టీకాలు తీసుకోవాలి."