బీటా, డెల్టా వేరియంట్ల(Delta variant)పై కొవాగ్జిన్(Covaxin) టీకా సమర్థవంతంగా పనిచేస్తోందని భారత వైద్య, పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తాజా అధ్యయనం తేల్చింది. ఈ వేరియంట్ల పైన భారత్ బయోటెక్ వ్యాక్సిన్ పనితీరుపై చర్చలు జరుగుతున్న వేళ ఈ అధ్యయన ఫలితాలు వెలువడ్డాయి.
Covaxin: 'డెల్టా వేరియంట్‌పై కొవాగ్జిన్ పనితీరు భేష్' - కరోనా వైరస్
డెల్టా వేరియంట్‌ను ఎదుర్కోవడంలో టీకాల సమర్థతపై ఆందోళన నెలకొన్న వేళ ఐసీఎంఆర్ కీలక అధ్యయనం చేసింది. డెల్టా, బీటా వేరియంట్ల(Delta variant)పై కొవాగ్జిన్(Covaxin) సమర్థవంతంగా పనిచేస్తోందని వెల్లడించింది.

కొవాగ్జిన్
ప్రస్తుతం ఉన్న టీకాలను ఛేదించి, కొత్త కేసులు, మరణాలు పెరగడంలో బీటా, డెల్టా వేరియంట్లు కీలకంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ అధ్యయనం ప్రాధాన్యం సంతరించుకుంది. బీటా, డెల్టా వేరియంట్లపై కరోనా నుంచి కోలుకున్నవారి రక్త నమూనాలు, కొవాగ్జిన్ టీకా రెండింటినీ పరీక్షించి.. టీకా ప్రభావం మెరుగ్గా ఉందని తెలిపింది ఐసీఎంఆర్. బి.1, ఆల్ఫా, జెటా, కప్పా వేరియంట్లపై కొవాగ్జిన్ సమర్థత ఇప్పటికే నిరూపితమైంది.
ఇదీ చూడండి:'డెల్టా వేరియంట్‌పై టీకాల ప్రభావం తక్కువే'