సెప్టెంబర్ నాటికి కొవాగ్జిన్ టీకా ఉత్పత్తి 10 రెట్లు పెరుగుతుందని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కరోనాపై తీవ్ర ప్రభావం చూపుతున్న మరో ఔషధం రెమిడెసెవిర్ తయారీ మే నుంచి నెలకు 74.1 లక్షలకు పెంచుతున్నట్లు వివరించారు.
కరోనాతో పోరాటంలో అన్ని రాష్ట్రాలకు కేంద్రం సమాన మద్దతు అందిస్తుందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఆక్సిజన్‌తో పాటు ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు అందజేస్తున్నామన్నారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు.