కరోనా సంక్షోభం నేపథ్యంలో విదేశాల నుంచి భారత్ కు అందుతున్న వితరణల పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించేందుకుగాను 'కొవ్ఎయిడ్' పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను నీతి ఆయోగ్ ఏర్పాటుచేసింది. విదేశీ దాతల నుంచి కేంద్ర ప్రభుత్వానికి అందే సహాయక సామగ్రి పారదర్శకంగా అంతిమ వినియోగదారులకు చేరే వరకు ఈ పోర్టల్ ద్వారా ట్రాక్ చేయొచ్చు. తదనుగుణంగా సమగ్ర ప్రామాణిక నిర్వహణ విధానాన్ని(ఎస్ఓపీ) దానిలో పొందుపర్చినట్లు ఓ అధికారి తెలిపారు.
విదేశీ వితరణలపై 'కొవ్ఎయిడ్' పర్యవేక్షణ - విదేశీ సాయం పర్యవేక్షణ కోసం పోర్టల్
విదేశాల నుంచి అందుతున్న కొవిడ్ సాయం పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు 'కొవ్ఎయిడ్' పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను నీతి ఆయోగ్ ఏర్పాటు చేసింది. వనరుల కొరత తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు సహాయక సామగ్రిని ప్రాధాన్యతా క్రమంలో అందజేసేందుకు ఈ పోర్టల్ ఉపకరించనుంది.
విదేశీ వితరణలపై 'కొవ్ఎయిడ్' పర్యవేక్షణ
కేసుల భారం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, వనరుల కొరత తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు సహాయక సామగ్రిని ప్రాధాన్యతా క్రమంలో అందజేసేందుకు 'కొవ్ఎయిడ్' వీలు కల్పిస్తుందని సదరు అధికారి వివరించారు.
ఇదీ చూడండి:యూకేకు పంపాల్సిన 50 లక్షల టీకాలు భారత్‌కే!