ముంబయిలోని క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసులో ఇటీవల అరెస్టయిన బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ (Srk Son Bail) తనయుడు ఆర్యన్ ఖాన్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఆయనకు బెయిల్ (Aryan Khan Bail) ఇచ్చే అంశంపై తీర్పును ప్రత్యేక న్యాయస్థానం రిజర్వులో ఉంచింది. ఈ నెల 20న బెయిల్‌పై తీర్పు వెలువరించనున్నట్టు వెల్లడించింది. దీంతో ఆర్యన్‌ను తిరిగి జైలుకు తరలించారు.
Aryan Khan bail: ఆర్యన్ బెయిల్‌పై తీర్పు రిజర్వు.. 20 వరకు జైల్లోనే.. - షారుక్ ఖాన్ కుమారుడు వార్తలు
ఆర్యన్ ఖాన్‌కు (Aryan Khan Bail) మళ్లీ నిరాశే ఎదురైంది. బెయిల్‌పై తీర్పును రిజర్వ్ చేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్యన్ 20వ తేదీ వరకు జైల్లోనే ఉండాల్సి ఉంది.
![Aryan Khan bail: ఆర్యన్ బెయిల్‌పై తీర్పు రిజర్వు.. 20 వరకు జైల్లోనే.. Aryan Khan bail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13356511-thumbnail-3x2-kjkdjklfj.jpg)
ఆర్యన్ బెయిల్
ఆర్యన్, అబ్బాజ్, మూన్‌మూన్ ధామేచాల బెయిల్ పిటిషన్‌పై ఎన్సీబీ, డిఫెన్స్ న్యాయవాదుల మధ్య కోర్టులో సుదీర్ఘవాదనలు కొనసాగాయి. ఆర్యన్‌కు బెయిల్ ఇవ్వొద్దని ఎన్సీబీ వాదించింది. అనంతరం బెయిల్‌పై తీర్పును జడ్జి వీవీ పాటిల్ ఈ నెల 20కు వాయిదా వేశారు. దీంతో ఈ నెల 20 వరకు ఆర్యన్ జైల్లోనే ఉండనున్నారు.
ఇదీ చూడండి:సాంబార్ రుచిగా లేదని.. తల్లి, సోదరి హత్య