Court order to seize Collector Car: రైతుకు పరిహారం సకాలంలో చెల్లించని ఓ జిల్లా కలెక్టర్‌పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన కారును జప్తు చేయాలని అధికారులను ఆదేశించింది. కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో ఈ ఘటన జరిగింది.
Karnataka Kalaburagi DC

అఫ్జల్పుర్ తాలుకా, ఉదాచన గ్రామానికి చెందిన కల్లప్ప మెట్రే అనే రైతు.. 2008లో భీమా ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తన 33 గుంట్ల భూమిని కోల్పోయాడు. దీనికి బదులుగా న్యాయస్థానం రైతుకు పరిహారం ఇవ్వాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.
అయితే, న్యాయస్థానం ఆదేశాలు పాటించలేదని కలబురిగి జిల్లా కలెక్టర్ యశ్వంత్ గురుకార్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కలెక్టర్ కారును జప్తు చేయాలని ఆదేశించింది. దీంతో కోర్టు సిబ్బంది, న్యాయవాదులు ఆయన కారును జప్తు చేసుకునేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు.
ఇదీ చదవండి:Golden Pearl Tea: ఈ టీ పొడి బంగారం.. కేజీ రూ.లక్ష!