తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Supreme Court: 'నేర తీవ్రతను పరిశీలించాకే బెయిల్!' - సర్క్యులర్​ విడుదల చేసిన సుప్రీం

నేర తీవ్రతను పరిశీలించిన తర్వాతే నిందితులకు బెయిల్ ఇవ్వడంపై ఆలోచన చేయాలని హైకోర్టులకు స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. డౌరీ డెత్​ కేసుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.

supreme court
సుప్రీం కోర్టు, సర్వోన్నత న్యాయస్థానం

By

Published : May 26, 2021, 11:09 PM IST

నిందితులకు బెయిల్ ఇచ్చేముందు నేర తీవ్రతను పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టులను ఆదేశించింది సుప్రీంకోర్టు. డౌరీ డెత్ కేసుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు నిందితుడికి బెయిల్​ ఇవ్వడంపై సర్వోన్నత న్యాయస్థానం ఈ విధంగా స్పందించింది. జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసుపై విచారణ జరిపింది.

"కట్నం కోసం ఓ మహిళను వేధించారు. ఆమె మరణానికి స్వయంగా కారకులయ్యారు. ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలను పూర్తిగా పరిగణలోకి తీసుకొని కోర్టులు ఓ నిర్ణయానికి రావాలి" అని జస్టిస్ ఎమ్​ ఆర్ షా అన్నారు. కారణం లేకుండా బెయిల్​పై ఆదేశాలివ్వడం సరికాదని పేర్కొన్నారు.

రూ. 15 లక్షలు, ఓ ద్విచక్ర వాహనం​ ఇచ్చినప్పటికీ మరింత కట్నం ఆశించి బాధితురాలు మృతికి కారణమైన నిందితుడిపై కేసు నమోదైంది. బాధితురాలి తమ్ముడు ఈ కేసు పెట్టారు. అయితే.. ఈ కేసుకు సంబంధించి నిందుతుడికి బెయిల్ ఇస్తున్నట్లు అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

సర్క్యులర్ విడుదల...

వేసవి సెలవుల నేపథ్యంలో.. అత్యవసర కేసులపై విచారణ జరిపేందుకు వెకేషన్ బెంచీలకు సర్క్యులర్​ విడుదల చేసింది సుప్రీంకోర్టు. వివిధ కేసులను లిస్టింగ్​ చేయడం గురించి సర్క్యులర్​లో పేర్కొంది. మే 26 నుంచి జూన్​ 2 వరకు వర్చువల్​గా విచారణ జరిపే న్యాయమూర్తుల బెంచీల కోసం ఈ సర్క్యులర్​ విడుదల చేసినట్లు పేర్కొంది.

రెండు డివిజన్​ బెంచ్​లు ఈ వ్యవధిలో కేసు విచారణ జరపనున్నట్లు సర్క్యులర్ పేర్కొంది. జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, జస్టిస్ అనిరుద్ధ బోస్ మొదటి బెంచ్​కాగా.. రెండో బెంచీలో జస్టిస్​ బీఆర్ గవై, జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారని తెలిపింది. ​

ఇదీ చదవండి:13 మందితో 'ఆమె' పెళ్లి- మరొకరిని చేసుకునేలోపే...

ABOUT THE AUTHOR

...view details