తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మధ్యవర్తిత్వ తీర్పులను కోర్టులు మార్చలేవు' - case study on arbitration in india

మధ్యవర్తిత్వ, రాజీ చట్టం-1996 పై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. మధ్యవర్తిత్వ తీర్పులను మార్పుచేసే అధికారం కోర్టుకు లేదని స్పష్టం చేసింది. ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్​ ఆర్​.ఎఫ్​. నారిమన్​, జస్టిస్​ బి.ఆర్. గవాయ్​ల ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది.

SC
సుప్రీంకోర్టు

By

Published : Jul 21, 2021, 4:43 AM IST

మధ్యవర్తిత్వ తీర్పులను మార్పుచేసే అధికారం కోర్టుకు లేదని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. మధ్యవర్తిత్వ, రాజీ చట్టం-1996 ప్రకారం, 'మధ్యవర్తి తీర్పును నిలుపుదల చేసే కోర్టు అధికార పరిధి'లో.. ఆ తీర్పును మార్పుచేసే అంశం లేదని పేర్కొంది. ఈ కారణంగా మధ్యవర్తిత్వ తీర్పును న్యాయస్థానాలు మార్పు చేయలేవని విస్పష్టం చేసింది.

ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్​ ఆర్​.ఎఫ్​. నారిమన్​, జస్టిస్​ బి.ఆర్. గవాయ్​ల ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ చట్టంలోని 34వ నిబంధనను పార్లమెంటు మార్చితేనే.. మధ్యవర్తిత్వ తీర్పులో మార్పులు చేసే అధికారం కోర్టులకు దఖలు పడగలదని వ్యాఖ్యానించింది. ఓ కేసులో- జాతీయ రహదారుల చట్టం కింద మధ్యవర్తిత్వ ట్రైబ్యూనల్ పరిహార మొత్తాన్ని నిర్ణయించింది.

అయితే.. బాధితులకు ఈ మొత్తాన్ని పెంచి ఇవ్వాలని మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయించింది. దీంతో మధ్యవర్తి తీర్పును కోర్టు ఎలా మార్పు చేస్తుందన్న ప్రశ్న తలెత్తింది. చివరికి ఈ అంశం సుప్రీంకోర్టుకు వెళ్లింది.

ఇదీ చదవండి:'ప్రజల ప్రాణాలను పణంగా పెడతారా?'

ABOUT THE AUTHOR

...view details