తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పీపీఈ కిట్లు ధరించి ఒక్కటైన యువ జంట - COVID

కరోనా మహమ్మారి కమ్మేస్తున్న వేళ... పీపీఈ కిట్లే పట్టు వస్త్రాలుగా ధరించి ఆ యువ జంట ఒక్కటైంది. వేద మంత్రాల నుంచి అప్పగింతల వరకు.. అన్ని కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరగగా.. కొవిడ్‌ నిబంధనల మధ్య ముందుగా నిర్ణయించిన ముహూర్తానికే ఆ యువ జంట ఏకమైంది. వరుడికి కరోనా సోకగా.. పరిమిత సంఖ్యలో బంధుమిత్రలు ఆశీర్వచనాలు పలకగా.. వారు కొత్తజీవితంలోకి అడుగుపెట్టారు.

Couple ties knot in PPE kits
పీపీఈ కిట్లు ధరించి పెళ్లి

By

Published : Apr 27, 2021, 1:21 PM IST

పీపీఈ కిట్లు ధరించి పెళ్లి చేసుకున్న యువ జంట

వివాహం అందరికీ ఒక చక్కని స్వప్నం. ఆ కలకు కరోనా వైరస్ అడ్డంకి కాబోదని ఓ జంట రుజువుచేసింది. పెళ్లిపీటలు ఎక్కడానికి గడియలు సమీపిస్తున్న తరుణాన వరుడు కరోనా బారినపడ్డాడు. ఏదేమైనా ఆ యువ జంట మాత్రం కొవిడ్ నిబంధనల మధ్య ఏకం కావాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా పీపీఈ కిట్లు ధరించి పెళ్లి మండపంలో.. వేద మంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. అగ్నిహోత్రం చుట్టూ ఏడడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పరిమిత బంధుమిత్రులు, అధికారులు, స్నేహితుల ఆశీర్వచనాల మధ్య నూతన జీవితానికి నాందిపలికారు.

మధ్యప్రదేశ్‌లోని రత్లం పట్టణంలో ఈ వివాహం జరిగింది. పురోహితుడు భౌతికదూరం పాటిస్తూ వేదమంత్రాలను పఠిస్తుండగా.. వధువు మెడలో వరుడు తాళిబొట్టు కట్టాడు. ఈ వివాహ వేడుకకు ముగ్గురు వ్యక్తులు హాజరయ్యారు. వీరందరూ పూర్తి రక్షణ సూట్లు ధరించారు.

పీపీఈ కిట్లతో నూతన వధూవరులు
అనుమతి లేకుండా పెళ్లి జరుగుతుండడం వల్ల అధికారులు వివాహాన్ని ఆపేందుకు కల్యాణ మండపానికి వచ్చారు. కానీ పూర్తి రక్షణ సూట్లు ధరించి పెళ్లి జరుగుతుండడం చూసి.. వారు కూడా ఆ యువ దంపతులను ఆశీర్వదించారు. వివాహం అనంతరం అప్పగింతల కార్యక్రమం కూడా జరిగింది. వరుడితో పాటు వధువు కూడా అదే కారులో అత్తారింటికి వెళ్లింది.

ఇదీ చూడండి:వరుడికి కరోనా- పీపీఈ కిట్​ ధరించిన వధువు

ABOUT THE AUTHOR

...view details