నీటి సమస్యను మున్సిపల్ అధికారులకు తెలియజేసేందుకు ఓ కొత్త జంట వినూత్న నిరసన చేపట్టింది. అప్పుడే పెళ్లైన ఈ నవ దంపతులు.. వాటర్ ట్యాంకర్‌పై ఊరేగింపుగా వెళ్లారు. నీటి సమస్య పరిష్కరించే వరకు హనీమూన్‌కు వెళ్లమని వాటర్ ట్యాంకర్‌పై రాయించారు. వీరి వివాహానికి వచ్చిన బంధువులు ఖాళీ బిందెలు తలపై పెట్టుకుని డ్యాన్స్‌లు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని కొల్హాపుర్‌లోని ఖాసబాగాలో శుక్రవారం జరిగింది.
అసలు విషయం ఏంటంటే:కొల్హాపుర్‌కు చెందిన విశాల్ కొలేకర్, అపర్ణ సాలుంఖే వివాహం మంగళవారం జరిగింది. వీధుల్లో నీటి కొరత సమస్యపై ఈ పెళ్లిలో గట్టి సందేశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కొత్తగా పెళ్లైన తన భార్య నీటి సమస్యను ఎదుర్కోకూడదని ఇలా చేశానని అంటున్నాడు వరుడు విశాల్. అలాగే నీటి కోసం ఖాసబాగా వాసులు పడుతున్న కష్టాలను మున్సిపల్ అధికారులకు తెలియజేసేందుకే వాటర్ ట్యాంకర్‌పై ఊరేగింపు నిర్వహించామని చెప్పాడు విశాల్.