కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలో (Dakshina Kannada news) ప్రకృతి పట్ల ప్రేమను చాటుకుంటోంది ఓ జంట. పక్షుల సంరక్షణ కోసం తమ జీవితాలను అంకితం చేసింది. పక్షుల కోసమే ప్రత్యేకంగా చెట్లను పెంచుతోంది.
జిల్లాలోని ఎలియనడుగు (Dakshina Kannada news)గ్రామంలో నిత్యానంద శెట్టి, రమ్య నిత్యానంద శెట్టి.. నివాసం ఉంటున్నారు. పక్షుల కోసమే ప్రత్యేకంగా వీరు చెట్లను పెంచుతున్నారు. పండ్ల చెట్లతో పాటు పక్షుల నివాసానికి అనువుగా ఉండే వృక్షాలను సంరక్షిస్తున్నారు. పక్షుల దాహార్థిని తీర్చడానికి మట్టి పాత్రల్లో నీటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీరు చేస్తున్న కృషి వల్ల ఈ ప్రాంతం (Karnataka news) పక్షుల కిలకిలారావాలతో అలరారుతోంది.
"మనం మన చుట్టూ ఉన్న పక్షులను కాపాడాలి. వాటి కోసం కొద్దిగా స్థలాన్ని కేటాయించాలి. వేసవి కాలంలో నీరు దొరకక పక్షులు వలస వెళ్తుంటాయి. అలా జరగకుండా కాపాడేందుకే మేం ఈ స్థలాన్ని ఉపయోగించి పక్షులను సంరక్షిస్తున్నాం. మొక్కలను విరివిగా పెంచుతున్నాం. ఈ పని చేయడం మాకు చాలా సంతోషాన్నిస్తుంది."