తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పదేళ్లుగా పేద పిల్లలకు ఉచిత విద్య.. స్కూల్​కు వచ్చేందుకు ఫ్రీ ఆటో.. స్పెషల్ ల్యాబ్స్​ కూడా! - మురికవాడల పిలల్లకు ఫ్రీ ఆటో

మురికివాడల్లో ఉండే పేద పిల్లలకు ఉచితంగా విద్య అందిస్తున్నారు దంపతులు. అంతే కాకుండా.. పాఠశాలకు వచ్చేందుకు వీలుగా ఫ్రీ ఆటో సదుపాయం కూడా కల్పిస్తున్నారు. సాంకేతికంగా అభివృద్ధి చెందేందుకు స్పెషల్​ కంప్యూటర్​ ల్యాబ్​ కూడా ఏర్పాటు చేశారు. పదేళ్లుగా విద్యాదానం చేస్తున్న ఆ దంపతులు ఎవరు?.. వారి సంగతేంటో తెలుసుకుందాం.

Free auto facility given to provide education to slum area children_
Free auto facility given to provide education to slum area children_

By

Published : Apr 25, 2023, 12:10 PM IST

Updated : Apr 25, 2023, 2:48 PM IST

పదేళ్లుగా పేద పిల్లలకు ఉచిత విద్య.. స్కూల్​కు వచ్చేందుకు ఫ్రీ ఆటో.. స్పెషల్ ల్యాబ్స్​ కూడా!

విద్య అనేది అందరి హక్కు. పేద విద్యార్థులకు ఈ హక్కు అందని ద్రాక్షలా మారకూడదన్న సంకల్పంతో పంజాబ్​కు చెందిన దంపతులు.. పదేళ్లుగా మురికివాడల్లో ఉండే పిల్లలకు ఉచితంగా విద్య అందిస్తున్నారు. విద్యార్థులంతా పాఠశాలకు వచ్చి వెళ్లేందుకు వీలుగా ఉచితంగా ఆటో సదుపాయం కల్పిస్తున్నారు. స్కూల్​లో ప్రత్యేక సైన్స్​ ల్యాబ్, కంప్యూటర్​ ల్యాబ్​ కూడా​ ఏర్పాటు చేశారు.

పంజాబ్​లోని బఠిండాకు చెందిన సోనీ గోయల్.. అహ్మదాబాద్​లో ఎంబీఏ చదువుకున్నారు. ఆ సమయంలో తన కాలేజీ సమీపంలోని మురికివాడల్లో ఉన్న పేద పిల్లలకు ఉచితంగా విద్యను అందించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అందుకు తన స్నేహితుడి సహాయం కూడా తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి తమ కాలేజీ పూర్తయ్యాక.. స్థానికంగా ఉన్న ఓ ఆలయంలో కొందరు పిల్లలకు విద్య బోధించడం ప్రారంభించారు. అలా అప్పటి నుంచి అహ్మదాబాద్​లో ఉచితంగా విద్య అందిస్తూ వచ్చారు.

సోని గోయల్​, నిశా

ఆ తర్వాత పంజాబ్​కు తిరిగి వచ్చిన సోనీ గోయల్​.. ఇక్కడ కూడా మురికివాడల్లో ఉండే పిల్లలకు ఉచితంగా విద్య అందించేందుకు పాఠశాలను స్థాపించాలని నిర్ణయించుకున్నారు. పదేళ్ల క్రితం.. బఠిండాలో ప్రయాస్​​ ఇంటర్నేషనల్​ స్కూల్ పేరుతో​ పాఠశాల ప్రారంభించారు. అప్పటి నుంచి మురికివాడల్లో ఉండే విద్యార్థులకు.. నిరాటంకంగా విద్య అందిస్తున్నారు. చుట్టుపక్క ప్రాంతాల్లో ఉన్న పేద పిల్లలంతా ఈ స్కూల్​కు వచ్చి.. చక్కగా చదువుకుంటున్నారు.

ఫ్రీ ఆటోల్లో విద్యార్థులు

ఫ్రీ ఆటో.. స్పెషల్​ కంప్యూటర్​, సైన్స్​ ల్యాబ్​లు..
అయితే చదువుపై వారికి ఆసక్తి పెరిగినా.. రోజువారీ రాకపోకలకు మాత్రం బాగా కష్టమయ్యేది. ఇదే విషయాన్ని పిల్లల తల్లిదండ్రులు.. సోనీ గోయల్​ దృష్టికి తీసుకెళ్లారు. అది తెలుసుకున్న ఆయన.. రోజూ పిల్లలు స్కూల్​కు వెళ్లి రావడానికి ఉచిత ఆటో సదుపాయం కల్పించారు. కంప్యూటర్, సైన్స్ ల్యాబ్​లు కూడా ఏర్పాటు చేశారు. అయితే వీటిన్నంటిలో అతడి​ భార్య నిశా కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. పంజాబ్​ స్కూల్​ ఎడ్యుకేషన్​ బోర్డు ద్వారా ఎనిమిదో తరగతి వరకు గుర్తింపు పొందిన ఈ పాఠశాలలో ప్రసుతం 200 మంది పిల్లలు చదువుకుంటున్నారు. విద్య అనేది ప్రతి చిన్నారి హక్కు అని, ప్రతి పేద బిడ్డను చదివించేందుకు తన కృషి కొనసాగుతుందని సోనీ గోయల్​ తెలిపారు.

కంప్యూటర్​ ల్యాబ్​లో విద్యార్థులు

"నేను అహ్మదాబాద్​లో చదువుకుంటున్న సమయంలో నా కాలేజీ బయట కొంతమంది పిల్లలు స్లమ్​ ఏరియాలో ఉండేవారు. క్యాంపస్​లో చదువుకున్న వారికి.. ఆ పిల్లలకు మధ్య చాలా తేడా ఉంది. నేను వారి మధ్యనున్న వ్యత్యాసాన్ని దూరం చేసేందుకు వారందరిని దగ్గరకు చేర్చి ఓ ఆలయంలో పాఠాలు చెప్పడం మొదలుపెట్టాను. ఆ తర్వాత పంజాబ్​లో ప్రయాస్​ స్కూల్​ ప్రారంభమైంది. మొదట్లో ఈ స్కూల్​ నడిపేందుకు మాకు ఇబ్బందిగా అనిపించింది. తొలుత ఈవెనింగ్​ స్కూల్​లా నడిపించాలనుకున్నాం. కానీ పూర్తి స్థాయిలో విద్య అందిచడం.. హక్కుగా భావించాము. అందుకే ఈ స్కూల్​ను మెయిన్​ స్ట్రీమ్​లోకి మార్చాము. అయినప్పటికీ పిల్లలు అధిక సంఖ్యలో జాయిన్ అవ్వలేదు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ స్కూల్​లో తమ చిన్నారులను చేర్చేందుకు వెనకాడేవారు. ఎంతో శ్రమించి అందరినీ మోటివేట్​ చేశాక అడ్మిషన్లు మొదలయ్యాయి."
-సోనీ గోయల్​, ప్రయాస్​ స్కూల్​ స్థాపకులు

చదువు పూర్తయ్యాక కూడా..
ప్రయాస్​ ఇంటర్నేషనల్​ స్కూల్​లో చదువుకున్నప్పుడే కాదు.. చదువు పూర్తి అయ్యాక కూడా సోనీ గోయల్​ దంపతులు.. విద్యార్థులకు సహాయం చేస్తున్నారు. కొందరు విద్యార్థులు ఐటీఐ కోర్సు చదువుకునేందుకు సహాయ పడుతున్నారు. మరికొందరు విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. నగరంలోని పలు సామాజిక సేవా సంస్థలు కూడా ప్రయాస్​ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులకు ఆర్థిక సహాయంతో పాటు ఉచితంగా పుస్తకాలు, యూనిఫారాలు అందజేస్తున్నాయి.

ప్రయాస్​ ఇంటర్నేషనల్​ స్కూల్​లో చదువుకుంటున్న విద్యార్థులు
Last Updated : Apr 25, 2023, 2:48 PM IST

ABOUT THE AUTHOR

...view details