తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రి వెడ్డింగ్​ ఫొటో షూట్​కు వెళ్లి...నదిలో పడి!

పెళ్లిని ఓ మంచి జ్ఞాపకంలా మిగుల్చుకోవాలని ఆశించిన ఓ జంట తిరిగిరాని లోకానికి వెళ్లిపోయింది. కర్ణాటకలోని తిరుమకుడాలో కావేరీ నదిలో ప్రీ వెడ్డింగ్​ ఫొటో షూట్​కు వెళ్లిన వధూవరులు నీళ్లల్లో పడి తుదిశ్వాస విడిచారు.

pre wedding shoot_death
ప్రి వెడ్డింగ్​ ఫోటో షూట్​కు వెళ్లి...నదిలో పడి!

By

Published : Nov 9, 2020, 8:21 PM IST

'ప్రి వెడ్డింగ్​ ఫొటో షూట్'​కు వెళ్లిన ఓ జంట తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయింది. కెమెరాను చూసి స్మైల్​ ఇస్తూ ఆ జంట నదిలో పడిపోయింది. ఈ ఘటన తిరుమకుడాలు నరసిపుర తాలుకులోని తలఖాదు గ్రామంలో జరిగింది.

పెళ్లింట్లో విషాదం..

తలఖాదు గ్రామానికి చెందిన చందు, శశికళకు ఇటీవలే నిశ్చితార్థం అయింది. ఈ నెల 22న పెళ్లి ముహూర్తం కూడా పెట్టారు వారి తల్లితండ్రులు. పెళ్లికి కొన్ని రోజుల ముందు జరిగే 'ప్రి వెడ్డింగ్ ఫోటో షూట్​' కోసం ఆ జంట సొంత గ్రామంలోని కావేరి నదికి పడవలో వెళ్లింది. ఈ క్రమంలో శశికళ కాలు జారి నదిలో పడింది. ఆమెను కాపాడే క్రమంలో చందు కూడా నదిలో పడిపోయాడు. ఇద్దరికీ ఈత రాకపోవడం కారణంగా ఆ జంట నదిలోనే తుది శ్వాస విడిచింది.

విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. తలఖాదు పోలీసు స్టేషన్​లో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

మృతురాలు శశికల
మృతురాలి వద్ద రోదిస్తోన్న కుటుంబ సభ్యులు
ప్రియురాలిని కాపాడబోయి మృతిచెందిన చందు

ఇదీ చదవండి:'అమెరికాలో ట్రంప్​కు పట్టిన గతే భాజపాకు పడుతుంది'

ABOUT THE AUTHOR

...view details