కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్(Puneeth rajkumar death) ఇక లేరనే విషయాన్ని ప్రజలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. రోజూ అనేకమంది వచ్చి పునీత్ సమాధిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో పునీత్‌పై అభిమానం ఉన్న ఓ ప్రేమజంట ఆయన సమాధి ముందే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంది.
ఏం జరిగిందంటే?
గంగ, గురు ప్రసాద్‌లు.. పెళ్లిచేసుకోవటానికి బళ్లారి నుంచి కంఠీరవ స్టూడియోలోని పునీత్(Puneeth rajkumar death) సమాధి వద్దకు శనివారం వెళ్లారు. వాళ్లిద్దరూ రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇద్దరూ పునీత్ రాజ్‌కుమార్‌కు వీరాభిమానులు.
అయితే పునీత్ సమాధి ముందు వివాహం చేసుకోవటానికి అక్కడి పోలీసులు అంగీకరించలేదు. దీంతో అక్కడి నుంచి వెనుదిరిగారు.