ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ సెంట్రల్ విస్టాపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. "దేశానికి కావలసింది ఆక్సిజన్.. ప్రధాన మంత్రికి ఇల్లు కాదు" అని అన్నారు. 'సెంట్రల్ విస్టా' క్రిమినల్ వేస్టేజ్(కొత్త పార్లమెంట్ శుద్ధ దండగ) అని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
ఆక్సిజన్ సిలిండర్ల కోసం కొందరు నిలబడి ఉన్న ఫొటోను, సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనుల ఫొటోను ట్విట్టర్లో రాహుల్ గాంధీ పోస్టు చేశారు.