Country Bomb in Tamilnadu: తమిళనాడులోని ఈరోడ్‌లో నాటు బాంబులను తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వన్యప్రాణులను వేటాడడానికి వీటిని తయారు చేస్తున్నట్లు నిందితులు నేరాన్ని అంగీకరించారు.
వన్యప్రాణుల వేటకు నాటు బాంబుల తయారీ.. ఇద్దరు అరెస్టు - poaching against wild animals in tamilnadu
Country Bomb in Tamilnadu: వన్యప్రాణులను వేటాడడానికి నాటు బాంబులను తయారు చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

నాటు బాంబులు
జిల్లాలోని గోబిచెట్టిపాళ్యంలో నిందితులు ఓ నాటు బాంబును వదిలివెళ్లారు. ఆ బాంబును ఓ ఆవు నమలగా.. పేలుళ్లు సంభవించాయి. అడవి పందులు, జింకలు, కుందేళ్లను వేటాడేందుకు నాటు బాంబులను ఉపయోగిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు.