దేశవ్యాప్తంగా 29 శాసనసభ, 3 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అసోంలో 5 స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా... భవానీపుర్, మరియాని, తౌరా శాసనసభా స్థానాల్లో భాజపా.... గోస్తైగావ్ స్థానంలో కాంగ్రెస్.... తముల్‌పూర్‌లో యూపీపీఎల్ ముందంజలో ఉన్నాయి.
బంగాల్‌లోని దిన్హటా, శాంతిపుర్, ఖర్దాహా, గోసబా స్థానాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా.... అన్ని స్థానాల్లోనూ అధికార తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మధ్యప్రదేశ్ పృథ్వీపూర్, రాయ్‌గావ్, జోబాట్ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుండగా... అన్ని స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
ఇతర రాష్ట్రాల్లో..
హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లోని 3, బిహార్, కర్ణాటక, రాజస్థాన్‌లోని రెండు స్థానాలకు.., హరియాణా, మహారాష్ట్ర, మిజోరాంలోని ఒక్కో స్థానానికి పోలైన ఓట్లను... లెక్కిస్తున్నారు. కర్ణాటకలో రెండు శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగగా... ఒక స్థానంలో భాజపా... ఒక స్థానంలో కాంగ్రెస్ ముందంజలో ఉన్నాయి. బిహార్‌లోని రెండు స్థానాల్లోనూ జేడీయూ అభ్యర్థులు..... రాజస్థాన్‌లోని రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. మేఘాలయలోని మూడు స్థానాల్లో.... రెండు స్థానాల్లో ఎన్పీపీ... ఒక స్థానంలో యూడీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
లోక్‌సభ స్థానాల కౌంటింగ్
అటు, లోక్‌సభ స్థానాలకు సంబంధించి దాద్రా నగర్ హవేలీ.., హిమాచల్ ప్రదేశ్‌లోని మండి, మధ్యప్రదేశ్ లోని ఖాంద్వా పార్లమెంటు స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అక్టోబర్ 30న ఉప ఎన్నికలు జరగగా ఈ స్థానాల్లో గతంలో భాజపా ఆరు, కాంగ్రెస్ తొమ్మిది, మిగిలినవి స్థానిక పార్టీలు గెలుపొందాయి.
ఇదీ చూడండి :మనీలాండరింగ్ కేసులో మాజీ హోంమంత్రి అరెస్ట్