తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పొలాల్లో భారీగా ఆయుధాలు, డ్రగ్స్​.. వారి పనే! - ఆయుధాల అక్రమ రవాణా

పాకిస్థాన్​ నుంచి పంజాబ్​ సరిహద్దుల గుండా దేశంలోకి ఆయుధాలు, మత్తుపదార్థాల అక్రమ రవాణాను భగ్నం చేశాయి భద్రతా దళాలు(bsf punjab news). సరిహద్దుల్లోని పొలాల్లో లభించిన మూటల్లో భారీగా ఆయుధాలు, మత్తుపదార్థాలను(heroine news) స్వాధీనం చేసుకున్నాయి. తనిఖీలు కొనసాగుతున్నట్లు బీఎస్​ఎఫ్​ వెల్లడించింది.

BSF recovered Arms
భారీగా ఆయుధాలు స్వాధీనం

By

Published : Oct 20, 2021, 3:34 PM IST

పంజాబ్​లోని సరిహద్దుల గుండా ఉగ్రవాదుల చొరబాట్లు, డ్రోన్ల ద్వారా ఆయుధాల రవాణాను అడ్డుకునేందుకు అమృత్​సర్​ కౌంటర్​ ఇంటెలిజెన్స్​, సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్​)(bsf punjab news) సంయుక్త ఆపరేషన్​ చేపట్టాయి. ఖేమ్​కరన్​ సెక్టార్​లోని మహందీపుర్​లో బుధవారం చేపట్టిన తనిఖీల్లో భారీగా ఆయుధాలు, మత్తుపదార్థాలను(heroine news) స్వాధీనం చేసుకున్నాయి.

పొలాల్లో జారవిడిచిన మూటల్లో మొత్తం 22 తుపాకులు, 44 మ్యాగజైన్స్​, 100 తూటాలు, ఒక కిలో హెరాయిన్​, 72 గ్రాముల ఓపియం మత్తుపదార్థాలు దొరికినట్లు బీఎస్​ఎఫ్​ అధికారులు తెలిపారు. వీటిని పాక్​ నుంచి దేశంలోకి డ్రోన్ల ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్నారని అనుమానిస్తున్నట్లు చెప్పారు. రాజ్​తల్​ ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి డ్రోన్ల శబ్దాలు సైతం వినిపించాయని, అప్రమత్తమైన బలగాలు.. కాల్పులు చేపట్టినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నట్లు చెప్పారు.

పండగల వేళ భద్రత పెంపు..

పండగల సీజన్​ను దృష్టిలో ఉంచుకుని పంజాబ్​వాప్తంగా భద్రతను పెంచారు అధికారులు. ఈ క్రమంలో పాకిస్థాన్​ నుంచి దేశంలోకి అక్రమంగా చొరబాటుకు యత్నిస్తున్న వారి అరెస్టులు పెరిగాయి. పాకిస్థాన్​ నుంచి పంజాబ్​లోని సరిహద్దుల ద్వారా ఉగ్రవాదుల చొరబాట్లు, డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మత్తుపదార్థాల స్మగ్లింగ్​ పెరిగిన నేపథ్యంలో భద్రతా దళాలు నిఘా పెంచాయి.

రూ.22 కోట్ల విలువైన హెరాయిన్​ పట్టివేత..

మరోవైపు.. ముంబయిలోని సియోన్​ కోలివాడా ప్రాంతంలో మత్తుపదార్థాలు స్మగ్లింగ్​ చేస్తున్న ఓ మహిళను(53)ను అరెస్ట్​ చేశారు మాదకద్రవ్యాల నిరోధక విభాగం అధికారులు. మహిళ వద్ద రూ.21.70 కోట్ల విలువైన 7.2 కిలోల హెరాయిన్​ను(heroine news) స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు ముంబయిలోని సబ్​అర్బన్​ మంఖుద్​ ప్రాంతానికి చెందిన అమీనా హమ్జా షేక్​ అలియాస్​ లాలీగా గుర్తించారు. లాలీతో సంబంధాలు ఉన్న వారిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు ఎన్​సీబీ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:కశ్మీర్​లో ఎన్​కౌంటర్- ఇద్దరు ఉగ్రవాదులు హతం

ABOUT THE AUTHOR

...view details