తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పుదుచ్చేరి ఎన్నికలకు రంగం సిద్ధం

పుదుచ్చేరిలో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మంగళవారం 30 స్థానాలకు పోలింగ్ జరగనుంది.

puducherry election 2021, పుదుచ్చేరి ఎన్నికలు
పుదుచ్చేరి ఎన్నికలు

By

Published : Apr 5, 2021, 7:04 PM IST

పుదుచ్చేరిలో మంగళవారం శాసనసభ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. మొత్తం 30 స్థానాల్లో 324 మంది అభ్యర్థలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

  • మొత్తం స్థానాలు: 30
  • మొత్తం అభ్యర్థులు: 324
  • ఓటర్లు: 10,04,507

పోటీలో ప్రముఖులు

  • సెల్వనాదన్ (కాంగ్రెస్​) - కదిర్​గమమ్​
  • ఎం కన్నన్​ (కాంగ్రెస్​) - ఇందిరా నగర్​
  • ఎన్​ రంగస్వామి (ఏఐఎన్​ఆర్​సీ) - తట్టంచవాడి
  • స్వామినాథన్ (భాజపా) - లాస్​పేట్​
  • రమేశ్​ ప్రియంబత్​ (కాంగ్రెస్​) - మాహి

హామీలు..

పుదుచ్చేరికి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం హోదా ఇస్తామని, ఏటా నిధుల పంపిణీ శాతాన్ని 25 నుంచి 40కి పెంచుతున్నట్లు భాజపా ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్​ తమను గెలిపిస్తే.. ఉచితంగా టీ​ పంపిణీ సహా ఉచిత విద్యను అందిస్తామని తెలిపింది. కేంద్రంలో తమ ప్రభుత్వం ఏర్పడితే పుదుచ్చేరి ప్రభుత్వం కేంద్రం వద్ద చేసిన అప్పులన్నీ మాఫీ చేస్తామని స్పష్టం చేసింది.

వీటితో పాటు తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన మక్కల్​ నీది మయ్యమ్​ పార్టీ పుదుచ్చేరిలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

ఇదీ చదవండి :అసోం మూడో దశ ఎన్నికలకు సర్వం సిద్ధం

ABOUT THE AUTHOR

...view details