"అందరికీ న్యాయం" విధానాన్ని మెరుగుపరచడంలో అతిపెద్ద అడ్డంకి 'వ్యయం' అని అభిప్రాయపడ్డారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. అయితే కరోనా సంక్షోభం వంటి పరిస్థితుల్లోను విధులు నిర్వర్తించి దేశ ప్రజలకు న్యాయాన్ని అందించిందని న్యాయవ్యవస్థపై ప్రశంసల వర్షం కురిపించారు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు కోవింద్. సంక్షోభంలో.. సాంకేతికతను ఉపయోగించుకుని అత్యున్నత న్యాయస్థానం ముందుకు సాగిన తీరు ప్రశంసనీయమన్నారు. తీర్పులను ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులో ఉంచడం తనకు ఎంతో సంతోషానిచ్చిందని వెల్లడించారు. న్యాయస్థానానికి ప్రజలను చేరువ చేసేందుకు ఇది దోహదపడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పాల్గొన్నారు.