భారత్‌లో కరోనా(Coronavirus update) వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 22,842 మంది (Covid cases in India) వైరస్ బారిన పడ్డారు. మరో 244 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 25,930 మంది కరోనాను జయించారు.
- మొత్తం కేసులు:3,38,13,903
- మొత్తం మరణాలు:4,48,817
- మొత్తం కోలుకున్నవారు:3,30,94,529
- యాక్టివ్ కేసులు:2,70,557
పరీక్షలు
శనివారం ఒక్కరోజే 12,65,734 కొవిడ్ పరీక్షలు(Testing update for covid-19) నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.
90 కోట్లు దాటిన టీకాలు..
భారత్‌లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. శనివారం కొత్తగా 73,76,846 టీకా డోసులు పంపిణీ చేయగా.. ఇప్పటివరకు మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 90,51,75,348కి పెరిగింది. "భారత్‌లో కరోనా డోసుల పంపిణీ మొత్తం 90 కోట్లు దాటింది. లాల్‌బహదూర్ శాస్త్రి 'జై జవాన్ - జై కిసాన్' నినాదం ఇచ్చారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ 'జై విజ్ఞాన్' అని అన్నారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ 'జై అనుసంధాన్' అని పిలుపునిచ్చారు. దాని ఫలితమే ఈ భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమం" అని ట్విట్టర్ వేదికగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా రాసుకొచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి (coronavirus worldwide) కొనసాగుతోంది. కొత్తగా 3,49,742 మందికి కరోనా (Corona update) పాజిటివ్‌గా తేలింది. వైరస్ ధాటికి 5,690 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,53,94,555కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 48,10,856కు పెరిగింది.
వివిధ దేశాల్లో కొత్త కేసులు..
- అమెరికా- 46,482
- బ్రిటన్- 30,301
- టర్కీ- 27,973
- రష్యా- 25,219
- బ్రెజిల్- 13,466
- ఇరాన్- 10,135
ఇవీ చూడండి: