Covid cases in India: భారత్‌లో కొవిడ్ కేసులు భారీగా తగ్గాయి. ఒక్కరోజులో.. 1,67,059 కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. 1192 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. కేరళ రాష్ట్రం మునుపటి గణాంకాలను సవరిస్తుండటమే ఈ మార్పునకు కారణం. 2,54,076 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 11.69 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
యాక్టివ్ కేసులు ప్రస్తుతం 4.20 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 94.60 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు:4,14,69,499
- మొత్తం మరణాలు: 4,96,242
- యాక్టివ్ కేసులు:17,43,059
- మొత్తం కోలుకున్నవారు:3,92,30,198
Vaccination in India
భారత్‌లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. సోమవారం 61,45,767 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,66,68,48,204కు చేరింది. నిర్విరామంగా సాగుతూ, అన్ని వయస్సుల వారికి చేరువవుతోన్న టీకా కార్యక్రమం మూడో ఉద్ధృతికి ముకుతాడు వేసిందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి.
Covid Tests:
సోమవారం.. దేశవ్యాప్తంగా 14 లక్షల 28 వేల 672 కరోనా పరీక్షలు చేశారు. మొత్తం టెస్ట్‌ల సంఖ్య 73 కోట్లు దాటింది.
World Corona cases
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 20,18,209 మందికి కరోనా సోకింది. 7,617 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 37,77,21,704కు చేరగా.. మరణాల సంఖ్య 56,91,213కు పెరిగింది.
- US Corona Cases: అమెరికాలో కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 274266 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. 1153 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 76 కోట్లు దాటింది.
- ఫ్రాన్స్‌లో ఒక్కరోజే 82 వేలకుపైగా కేసులు వెలుగుచూశాయి. మరో 348 మంది చనిపోయారు.
- ఇటలీలో 57,715 కొత్త కేసులు బయటపడగా.. 349 మంది మరణించారు.
- బ్రెజిల్లో కొత్తగా 102,616 మందికి వైరస్ సోకగా.. 442 మంది చనిపోయారు.
- అర్జెంటీనాలో తాజాగా 43 వేలకుపైగా కరోనా కేసులు బయటపడగా.. 285 మంది బలయ్యారు.
- జర్మనీలో ఒక్కరోజే దాదాపు లక్షా 20 వేల మందికి వైరస్ సోకింది. మరో 147 మంది మృతి చెందారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇవీ చూడండి:కేరళలో తగ్గిన కరోనా కేసులు.. భారీగా పెరిగిన మరణాలు
'వ్యాక్సినేషన్‌తో దేశ శక్తిసామర్థ్యాలు ప్రపంచవ్యాప్తం'