తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనా' ఆకారంలో దోసకాయ.. ఎప్పుడైనా చూశారా? - కొమ్ముల దోసకాయ

ఓ రైతు పొలంలో అచ్చం కరోనా వైరస్ ఆకారంలో దోసకాయ కాసింది. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. దాన్ని చూసేందుకు ఆ రైతు పొలం వద్దకు అనేక మంది తరలివస్తున్నారు.

Coronavirus shaped cucumber
కరోనా ఆకారంలో దోసకాయ

By

Published : Nov 16, 2021, 1:13 PM IST

Updated : Nov 16, 2021, 2:26 PM IST

కరోనా ఆకారంలో దోసకాయ

కంటికి కనిపించని కరోనా వైరస్​తో ప్రపంచమంతా పోరాడుతోంది. ఎన్నో రంగాలను కుదిపేసిన, ఎందరి జీవితాలనో బలి తీసుకున్న ఆ వైరస్​​ రూపం ఎలా ఉంటుందో.. శాస్త్రవేత్తలు కొన్ని ఊహా చిత్రాలను విడుదల చేశారు. కొమ్ములతో కిరీటంలా ఉంటుందని చెప్పారు. ప్రపంచమంతా కొవిడ్​ అనగానే అదే రూపాన్ని గుర్తుకు తెచ్చుకుంటుంది. ఇప్పుడు అచ్చం కరోనా వైరస్​ను పోలి ఉన్నట్లుగా ఒడిశాలోని ఓ రైతు పొలంలో దోసకాయ కాసింది. దాంతో దాన్ని చూసేందుకు జనం ఎగబడుతున్నారు.

కాయపై కొమ్ములతో..

నవరంగ్​పుర్ జిల్లాకు(Odisha nabarangpur) చెందిన సారగూడ గ్రామానికి చెందిన రవి కిరణ్​ నాగ్ అనే రైతు పొలంలో ఈ వింత దోసకాయ కాసింది. అన్ని దోసకాయలు మామూలుగానే ఉండగా... ఈ ఒక్కటి మాత్రం విభిన్నంగా ఉంది. కరోనా వైరస్​కు ఉన్నట్లుగానే దీనిపై కొమ్మలు ఉన్నాయి. దాంతో ఈ దోసకాయ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. 'కరోనా కాయ' అని పిలుచుకుంటూ నెటిజన్లు దీన్ని తెగ షేర్ చేస్తున్నారు. అంతేకాదు.. ఈ కాయను కళ్లారా చూసేందుకు చాలా మంది తమ పొలం వద్దకు కూడా వస్తున్నారని చెబుతున్నారు రైతు రవి కిరణ్​.

అచ్చం కరోనా వైరస్​లానే ఉన్న దోసకాయ
రైతు రవి కిరణ్ నాగ్ పొలంలో కాసిన దోసకాయ
కరోనా ఆకారంలో ఉన్న దోసకాయ

"కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు నేను పొలం వద్దకు వెళ్లాను. అక్కడి దోస తోటలో ఒక కాయ ఇలా కరోనా వైరస్​ రూపంతో కనిపించింది. నేను దీన్ని చూసి, చాలా ఆశ్చర్యపోయాను. అనంతరం ఆ దోసకాయ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాను. అవి చూసి చాలా మంది.. ఈ దోసకాయను చూసేందుకు మా పొలం వద్దకు వస్తున్నారు. దానితో ఫొటోలు దిగుతున్నారు" అని రైతు రవి కిరణ్ నాగ్ తెలిపారు.

ఇదీ చూడండి:కరోనా చెవిలీలు: దర్జాగా వైరస్​ను ధరించండి!

Last Updated : Nov 16, 2021, 2:26 PM IST

ABOUT THE AUTHOR

...view details