భారత్‌లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ఒక్కరోజే 18,327 కేసులు వెలుగుచూశాయి. మరో 108 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 1,11,92,088కు చేరగా.. మరణాల సంఖ్య 1,57,656 కు పెరిగింది.
కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. శుక్రవారం.. 14,234 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ఫలితంగా ఇప్పటివరకు 1,08,54,128 మంది కొవిడ్‌ను జయించారు. ప్రస్తుతం 1,80,304 యాక్టివ్ కేసులు ఉన్నాయి.