భారత్‌లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. కొత్తగా 14,989 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య కోటీ 11 లక్షల 39 వేలు దాటింది. తాజాగా 98 మంది కొవిడ్‌తో మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1,57,346కు చేరింది.
కొత్తగా 13,123 మంది కొవిడ్‌ను జయించారు. ఫలితంగా ఇప్పటివరకు కోటీ 8 లక్షల మందికి పైగా కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 1,70,126 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది.