తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనా 2.0 కథ ముగియలేదు.. తేలికగా తీసుకుంటే...'

కరోనా రెండో దశ ముప్పు ఇంకా తొలగిపోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. వేగంగా టీకా పంపిణీతో పాటు.. కరోనా నిబంధనలను విధిగా పాటిస్తేనే మహమ్మారి ముప్పు నుంచి బయటపడగలమని ఉద్ఘాటించింది.

DEL48-VIRUS-HEALTH MINISTRY
'రెండో దశ ముప్పుపై నిర్లక్ష్యం తగదు'

By

Published : Jul 2, 2021, 6:08 PM IST

కరోనా రెండో దశ ముప్పు ఇంకా తొలగిపోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. జూన్ 23-29 మధ్యలో 71 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా ఉందని.. అందువల్ల రెండో దశ ముప్పు ముగిసినట్లు భావించొద్దని హెచ్చరించింది. మహమ్మారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. నిర్లక్ష్యం చేయకూడదని సూచించింది. వేగంగా టీకా పంపిణీతో పాటు.. కరోనా నిబంధనలను పాటిస్తేనే మహమ్మారి ముప్పు నుంచి బయటపడగలమని ఉద్ఘాటించింది.

దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. ఇందులో భాగంగా..

  • జూన్ 21 నుంచి రోజుకు సగటున 50 లక్షల మందికి టీకాలు అందిస్తున్నట్లు వివరించింది. ఇది మొత్తం నార్వే జనాభాకు టీకాల పంపిణీకి సమానం.
  • ఇప్పటివరకు 34 కోట్ల మందికి.. అంటే మొత్తం అమెరికా జనాభాకు సమానమైన ప్రజలకు కనీసం మొదటి డోసు టీకా అందించినట్లు ప్రభుత్వం పేర్కొంది.
  • దాదాపు 80 శాతం మంది ఆరోగ్య కార్యకర్తలు, 90 శాతం మంది ఫ్రంట్‌లైన్ కార్మికులకు రెండు డోసులు అందించినట్లు తెలిపింది.

అందుబాటులోకి మరో టీకా..

సింగిల్ డోస్ టీకాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జాన్సన్ అండ్ జాన్సన్‌ సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకె పాల్ వెల్లడించారు. ప్రస్తుతానికి అమెరికాలో ఉత్పత్తి అవుతోన్న ఈ టీకాను.. హైదరాబాద్​లోని బయోలాజికల్-ఇ సంస్థలో ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇక.. దేశంలోని 12 రాష్ట్రాల్లో డెల్టా ఏవై 1(డెల్టా ఏ ప్లస్) కేసులు 56 ఉన్నాయని వివరించారు.

ఇవీ చదవండి:

డాక్టర్స్ డే రోజునే యువ వైద్యుల ఆత్మహత్య

సగానికిపైగా మరణాలు మే, జూన్​లోనే!

ABOUT THE AUTHOR

...view details