తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Covid-19: వరుసగా రెండో రోజు లక్షలోపే కేసులు - కొవిడ్​ కేసులు

దేశంలో కరోనా కేసులు (Covid-19 cases) తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 92,596 మందికి కొవిడ్(covid-19 India) సోకింది. వైరస్​ బారినపడి మరో 2219 మంది మరణించారు.

Corona Virus
కరోనా వైరస్​ కేసులు

By

Published : Jun 9, 2021, 9:30 AM IST

దేశంలో కొవిడ్ ఉద్ధృతి(Covid-19 cases) క్రమంగా తగ్గుతోంది. క్రితం రోజుతో పోల్చితే కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 92,596మంది వైరస్ బారినపడ్డారు. మహమ్మారి ధాటికి మరో 2219 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,62,664 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 94.55 శాతం, యాక్టివ్​ కేసులు 4.23 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • మొత్తం కేసులు:29,089,069‬
  • మొత్తం మరణాలు: 3,53,528
  • కోలుకున్నవారు: 2,75,04126
  • యాక్టివ్ కేసులు: 12,31,415

2021, జూన్​ 8 వరకు మొత్తం 37,01,93,563 పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ICMR) తెలిపింది. మంగళవారం ఒక్కరోజే 19,85,967 నమూనాలు పరీక్షించినట్లు వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details