దేశవ్యాప్తంగా కొవిడ్-19 వైరస్ కేసులు, మరణాలు శుక్రవారంతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 36,011 మంది కరోనా బారిన పడ్డారు. మరో 482 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 1.40 లక్షలు దాటింది. తాజాగా కరోనా నుంచి కోలుకుని 41,970 మంది ఇళ్లకు వెళ్లారు.
మొత్తం కేసుల సంఖ్య- 96,44,222
మరణాల సంఖ్య -1,40,182
కోలుకున్నవారి సంఖ్య - 91,00,792
క్రియాశీల కేసులు- 4,03,248
డిసెంబర్ 5 వరకు దేశవ్యాప్తంగా మొత్తం 146,986,575 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్క శనివారం రోజే 11,01,063 కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపింది. రికవరీ రేటు 94.28 శాతానికి చేరగా మరణాల రేటు 1.45కు తగ్గినట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 4.26 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇదీ చూడండి: అమెరికాలో ఒక్కరోజులో 2 లక్షల కరోనా కేసులు