దేశంలో కొవిడ్(COVID) ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 58,419 కేసులు వెలుగులోకి వచ్చాయి. మహమ్మారి ధాటికి మరో 1576 మంది ప్రాణాలు కోల్పోయారు. 87,619 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 81 రోజుల తర్వాత తొలిసారి.. 60వేల కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో రికవరీ రేటు 96.27శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
- మొత్తం కేసులు: 2,98,81,965
- మొత్తం మరణాలు:3,86,713
- కోలుకున్నవారు: 2,87,66,009
- యాక్టివ్ కేసులు:7,29,243
శనివారం ఒక్కరోజే 18,11,446 పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దీనితో ఇప్పటివరకు నిర్వహించిన టెస్టుల సంఖ్య 39,10,19,083కు చేరింది.
టీకా పంపిణీ..