Corona Vaccine Update: కరోనా వ్యాప్తి నేపథ్యంలో వ్యాక్సినేషన్ పంపిణీని విస్తృతం చేసింది కేంద్రం. తాజాగా మరోసారి ఒక్కరోజే కోటి డోసుల పంపిణీని పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో వ్యాక్సినేషన్‌కు సంబంధించి భారత్ కొత్త రికార్డులను నెలకొల్పుతోందని తెలిపారు.
Corona Vaccine: దేశంలో మరోసారి ఒక్కరోజులో కోటి డోసుల పంపిణీ - వ్యాక్సినేషన్
Corona Vaccine Update: దేశంలో మరోసారి ఒక్కరోజే కోటి డోసులు పంపిణీ అయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 127.5 కోట్లు దాటింది.
మరోసారి కోటి దాటిన టీకా పంపిణీ
శనివారం ఒక్కరోజే 1,00,00,016 మందికి టీకా పంపిణీ కాగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకాల సంఖ్య 127.5 కోట్లు దాటింది. రోజుకు సగటున 59.32 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు పెద్దల్లో 84.8 శాతం మంది తొలి డోసు తీసుకోగా.. 50 శాతం మంది రెండో డోసు తీసుకున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి :టీకా తీసుకోమన్నందుకు రాయితో కొట్టబోయిన వృద్ధుడు- వీడియో వైరల్